: ఏపీలో ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం: చంద్రబాబు


బెంగళూరులో ప్రైవేటు సెక్టార్ లో కొత్తగా ఏర్పాటైన న్యూటనిక్స్ ఐటీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ ను అంతర్జాతీయ చిత్రపటంలో తామే నిలిపామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ లో విస్తృత అవకాశాలున్నాయని... పరిశ్రమలు, ఐటీ సంస్థలకు కూడా అటువంటి అవకాశాలున్నాయని వివరించారు. సంక్షేమ పథకాల్లో ఐటీ సాయంతో అనర్హులను ఏరి వేస్తున్నామన్న చంద్రబాబు... క్లౌడ్ కంప్యూటింగ్ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని పేర్కొన్నారు. నవ్యాంధ్రలో విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి విషయంపై మాట్లాడిన బాబు, ఇది చాలా సున్నితమైన విషయమన్నారు. ఇరు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకోవాలని, కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలతో సహకరించుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News