: కసరత్తులు చేయకపోతేనేం... ఓ గ్లాసు రెడ్ వైన్ పుచ్చుకోండి!
రెడ్ వైన్ కు సంబంధించి పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. గంటసేపు కసరత్తులు చేస్తే ఎంత ఆరోగ్యం లభిస్తుందో... ఓ గ్లాసెడు రెడ్ వైన్ తో కూడా అంతే ఆరోగ్యం సమకూరుతుందట. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీకి చెందిన జాసన్ డైక్ బృందం ఈ అంశంపై అధ్యయనం చేపట్టింది. ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ను రెడ్ వైన్ లో గుర్తించిన డైక్ అండ్ కో, అది హృదయ, కండర సంబంధ కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని తెలుసుకుంది. గ్లాసు రెడ్ వైన్ తో లభించే శక్తి... గంటపాటు ఎక్సర్ సైజులు చేస్తే ఉత్పన్నమయ్యే శక్తితో సమానమని డైక్ పేర్కొన్నారు.