: రష్యాలో స్టీవ్ జాబ్స్ స్మారక చిహ్నం తొలగింపు!


రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కళాశాల వెలుపల ఉన్న ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ స్మారక విగ్రహాన్ని తొలగించారు. తాను 'గే' ననీ, అందుకు గర్వపడుతున్నానని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2013లో ఐఫోన్ ఆకారంలో ఏర్పాటు చేసిన రెండు మీటర్లకు పైగా ఉండే ఆ విగ్రహాన్ని తొలగించినట్లు రష్యన్ కంపెనీల గ్రూప్ జెఈఎఫ్ఎస్ తెలిపింది. "రష్యాలో గే ప్రచారాన్ని, మైనర్ల సెక్సువల్ కార్యకలాపాలను చట్ట ప్రకారం నిషేధించారు" అని జెఈఎఫ్ఎస్ తెలిపింది. అయితే, ఆ విగ్రహాన్ని ఇతర ప్రాంతంలో యువ విద్యార్థులు, స్కాలర్లు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది.

  • Loading...

More Telugu News