: లెక్కలు రాని పంతులమ్మను ఇంటికి పంపారు!


ఉత్తరప్రదేశ్ లోని బిధానులో ఓ పాఠశాలలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బేసిక్ శిక్షా అధికారి (బీఎస్ఏ) రాజేంద్ర ప్రసాద్ అక్కడి హర్హా ఉన్నత పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లారు. మూడో తరగతి చదువుతున్న ఆస్థా, అంకిత అనే బాలికలను 312ను అంకెల్లో రాయమని అడిగారు. వాళ్లు రాయలేకపోయారు. ప్రశాంత్ అనే బాలుడు కూడా తప్పుగానే రాశాడు. ఆశ్చర్యపోయిన ఆ అధికారి టీచర్ రుచి శ్రీవాస్తవపై దృష్టి పెట్టాడు. 315 ను 3తో భాగించమని కోరాడు. పాపం, ఆ టీచర్ కు ఆ లెక్క సాధ్యం కాలేదు. దీంతో, దిగ్భ్రాంతికి గురయ్యాడా అధికారి! స్కూల్లో మిగతా టీచర్లను చూస్తే, పాఠాలు చెప్పకుండా, మొబైల్ ఫోన్లతో బిజీగా కనిపించారు. వెంటనే రాజేంద్ర ప్రసాద్ పాఠశాల ప్రిన్సిపాల్ శశి ప్రభ, టీచర్లు రుచి శ్రీవాస్తవ, మమతా సింగ్, స్వప్న తివారీపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో, జిల్లా విద్యాశాఖ రుచి శ్రీవాస్తవ చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ పెట్టింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఓ క్వాలిఫైడ్ టీచర్ కు లెక్కలు రాకపోవడాన్ని అసలు ఊహించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News