: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు
ఢిల్లీలోని రాజకీయ పరిస్ధితులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఓ నివేదిక పంపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ రాజకీయ పార్టీ సుముఖంగా లేదని, కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారని అందులో తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని నివేదికలో రాష్ట్రపతికి సిఫారసు చేశారు. ఈ నెల 11 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన క్రమంలో నిన్న (సోమవారం) బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలతో గవర్నర్ చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుపై తామెవ్వరమూ సుముఖంగా లేమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.