: నేడు కేంద్ర కేబినెట్ భేటీ... ఢిల్లీ ఎన్నికలపై నిర్ణయం?


ఢిల్లీలో జరపాల్సిన ఎన్నికలపై నేడు కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర కేబినెట్ నేటి సాయంత్రం ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సహా ఏ పార్టీ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో అక్కడ ఎన్నికలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అటు రాష్ట్రపతితో పాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం వేగంగా పావులు కదిపారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లతో ఆయన చర్చలు జరిపారు. మూడు పార్టీలు కొత్తగా ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపాయి. ఇదే విషయాన్ని గవర్నర్, రాష్ట్రపతికి నివేదించారు. దీంతో అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతి నుంచి ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. కేబినెట్ భేటీలోగా ఈ ఆదేశాలు జారీ అయితే, ఎన్నికల నిర్వహణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News