: నేడు ప్రత్యూష్ సిన్హా కమిటీ చివరి భేటీ!


తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు భేటీ కానుంది. ఈ భేటీకి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరితో పాటు తమ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన పది మంది ఐఏఎస్ అధికారులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీల్లో నేడు జరగనున్నదే చివరిదిగా భావిస్తున్నారు. ఈ భేటీలో అధికారుల విభజనకు సంబంధించి తుది జాబితాను విడుదల చేయనున్న కమిటీ, జాబితాను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేయనుంది. దీనితో కమిటీ పని ముగిసినట్లవుతుంది. ఈ జాబితాకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం లభించిన అనంతరం, కమిటీ సిఫారసుల మేరకు అధికారులు ఆయా రాష్ట్రాలకు తరలివెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News