: థైరాయిడ్ లోపంతో చెవుడు కూడా వస్తుందట!
ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. థైరాయిడ్ లోపంతో బాధపడేవారిలో... ఆందోళన, చెమటలు పట్టడం, బరువు పెరగడం, జుట్టు ఊడటం, నిస్సత్తువలాంటి మరెన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు చెవుడు కూడా వచ్చి చేరింది. ఎదుగుతున్న దశలో థైరాయిడ్ హార్మోన్ల లోపం ఏర్పడితే వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని 'టెల్ అవీవ్' విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.