: ప్రైవేటు యూనివర్శిటీలను అంగీకరించే ప్రసక్తే లేదు: జగన్
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ యూనివర్శిటీలను అంగీకరించమని వైకాపా అధినేత జగన్ అన్నారు. పేదలకు విద్యను దూరం చేసే ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు. వామపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాల నేతలు ఈ విషయమై జగన్ ను కలసి... బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోందని జగన్ కు తెలిపారు. దీనిపై స్పందించిన జగన్... పేద విద్యార్థుల సంక్షేమం కోసం వైకాపా కట్టుబడి ఉందని... బిల్లును తప్పకుండా వ్యతిరేకిస్తామని చెప్పారు.