: నేడు ఢిల్లీకి దేవినేని... ఉమాభారతితో భేటీ


నిన్న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా, నేడు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీ వెళుతున్నారు. ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు ఢిల్లీ పయనమవుతున్నారు. కేంద్రమంత్రి ఉమాభారతిని కలసి వాస్తవ పరిస్థితిని ఆమె ముందు ఉంచనున్నారు. శ్రీశైలం జలాలు రాయలసీమకు ఎంత అవసరమో వివరించడంతో పాటు... తెలంగాణకు తాము 300 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఆమె దృష్టికి తీసుకెళుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిని ఆమెకు వివరించనున్నారు. టీఎస్ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేస్తోందని తెలపనున్నారు.

  • Loading...

More Telugu News