: మేనకోడలిని వేధించి కటకటాలపాలయ్యాడు


మేనమామ అంటే అమ్మ తరువాత అమ్మగా భావిస్తారు. తల్లితో వివాదమొస్తే తండ్రైనా కినుక వహిస్తాడేమో కానీ, మేనమామ బాసటగా నిలబడతాడని భావిస్తారు. అలాంటి బంధానికి కళంకం తెచ్చాడో కామాంధుడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దాసు అనే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సొంత చెల్లెలి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లి అన్నను నిలదీసింది. దీంతో ఆగ్రహించిన దాసు తన చెల్లిపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు కల్పించుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాసు వేధింపులు భరించలేని అతని మొదటి భార్య ముగ్గురు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోగా, మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News