: పోకిరీ పనిపట్టిన యువతికి పది వేల రివార్డు!


ఆమె మామూలు అమ్మాయి కాదు. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన యువతి. అందుకే, తన జోలికొచ్చిన పోకిరీకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పింది. తైక్వాండో, వుషు లలో బ్లాక్, రెడ్ బెల్టులు పొందిన జాతీయస్థాయి క్రీడాకారిణి తన ట్రైనింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో రాజేష్ గుప్తా (28) అనే యువకుడు ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె అతగాడికి నాలుగు పంచ్లు బహూకరించి, తన ట్రైనర్ అమిత్ గోస్వామి సాయంతో పోలీసులకు అప్పగించింది. తనను వేధించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొని, పోలీసులకు పట్టించడంతో, ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆమెకు 10 వేల రూపాయల రివార్డు, ఓ పతకం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిందని కమిషనర్ ప్రశంసించారు. అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం ఇలాంటి విద్యల్లో శిక్షణ పొందాలని, అప్పుడే ఏ ఆపద వచ్చినా తమను తాము కాపాడుకోగలుగుతారని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News