: మృగరాజు సురక్షితంగా బయటపడ్డాడు!


విశాలమైన అడవులు అంతరించిపోయాయి. అరణ్యాల్లో మనిషి కన్ను పడ్డ ప్రతి ప్రాంతం నాశనమైపోయింది! తద్వారా, జంతువులకు ఆహారం దొరకని పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో, ఆహారం వెదుక్కుంటూ బయల్దేరిన ఓ సింహం ప్రమాదవశాత్తూ నేల బావిలో పడిపోయింది. గుజరాత్ లో జరిగిందీ ఘటన. దీనిని బయటికి తీసేందుకు గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా అమరాపూర్ గ్రామస్థులు చేయని ప్రయత్నం లేదు. ఎంతకూ సింహాన్ని బయటకు తీయలేకపోవడంతో, చివరికి అటవీశాఖాధికారులకు సమాచారమందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని, దాన్ని తాళ్ళ సాయంతో బంధించి వెలికితీశారు. ఏడు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న ఈ సింహానికి ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండానే బోనులో బంధించి అభయారణ్యంలో వదిలేశారు.

  • Loading...

More Telugu News