: మీరెప్పుడు మరణిస్తారో తెలిపే యాప్ వచ్చేసింది!


క్షణభంగురమీ జీవితం... నేడు నీది, రేపటికి ఉంటావో ఊడుతావో ఎవరు చూడొచ్చారు? అని ఓ జ్ఞాని సెలవిచ్చినప్పటికీ, తమ మరణం ఎప్పుడో తెలిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం ఓ యాప్ వచ్చేసింది. 'డెడ్ లైన్' అనే ఈ యాప్ ను మీ ఐఫోన్ లో అప్ లోడ్ చేసుకుంటే...అందులో ఉన్న మీ హెల్త్ కిట్ టూల్ నుంచి సమాచారం స్కాన్ చేసి మీరు ఏ రోజు మరణిస్తారో చెప్పేస్తుంది. అయితే వాస్తవానికి ఏ యాప్ కూడా కచ్చితమైన మరణ తేదీ చెప్పలేదని, ఆరోగ్య పరిస్థితిని మాత్రమే వివరిస్తుందని, మీ ఆరోగ్య స్థితి ప్రకారం మీ ఆయుఃప్రమాణం అంచనా వేస్తుందని రూపకర్తలు చెప్పారు. మీ హెల్త్ కిట్ టూల్ లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని బట్టి, అంటే ఎంత సేపు పడుకుంటున్నారు? ఎంత సేపు వ్యాయామానికి కేటాయిస్తున్నారు? వంటి వివరాల ఆధారంగా, మీకు కొన్ని ప్రశ్నలు సంధించి, మీరిచ్చిన సమాధానాల ప్రకారం మీ మరణతేదీని అంచనా వేసి చెప్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆయుఃప్రమాణం పెంచుకోవచ్చని ఈ యూప్ రూపకర్త జస్ట్ ఎల్ఎల్ సీ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News