: 'ఐదుసార్లు' ఏటీఎం వినియోగం పరిమితిపై తర్జనభర్జనల్లో బ్యాంకులు


నెలలో 'ఐదుసార్లు' ఏటీఎం వినియోగంపై బ్యాంకులు పునరాలోచనలో పడ్డాయి. సొంత కస్టమర్లకు ఉచిత లావాదేవీలపై పరిమితి విధించడంతో బ్యాంకు బ్రాంచీలకు కస్టమర్ల తాకిడి పెరిగిపోయే ప్రమాదముంది. నగదు విత్ డ్రాయల్స్, ఇతర సేవల కోసం కస్టమర్లు నేరుగా బ్యాంకుకే వస్తారు. దీంతో బ్యాంకు బ్రాంచీకి తాకిడితోపాటు ఖర్చు కూడా పెరిగిపోయే ప్రమాదముందని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ కారణంగానే, ఎస్ బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకు వంటివి ఇంకా పరిమితి ప్రకటించలేదని తెలుస్తోంది. ఏటీఎం నుంచి నగదు లావీదేవీలంటే డబ్బులు విత్ డ్రా చేయడమే కాదు, బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసినా లావాదేవీ కిందే లెక్క. ఐదుసార్లు పరిమితి దాటితే, ఆపై ప్రతి లావాదేవీకి 20 రూపాయల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సొంత బ్యాంకుల ఏటీఎంల వాడకంపై పరిమితిని ఆయా బ్యాంకులే నిర్ణయించవచ్చని ఆర్బీఐ పేర్కొనడంతో ఎంత పరిమితి విధిస్తే బాగుంటుందోనని బ్యాంకులు తర్జనభర్జనలు పడుతున్నాయి.

  • Loading...

More Telugu News