: అతిపెద్ద విజయం నమోదు చేసుకున్న పాకిస్థాన్ జట్టు
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. తటస్థ వేదిక అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ 356 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. పరుగుల తేడా పరంగా పాకిస్థాన్ కు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో పాక్ 570/6 వద్ద డిక్లేర్ చేయగా, కంగారూలు 261 పరుగులు చేశారు. అనంతరం, ఆసీస్ ను ఫాలో ఆన్ ఆడించకుండా, తానే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ 3 వికెట్లకు 293 పరుగులు చేసింది. తద్వారా ఆసీస్ ముందు 603 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. అయితే, కంగారూలు ఏ దశలోనూ ఆకట్టుకునేలా కనిపించలేదు. చివరికి రెండో ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌటయ్యారు. అంతకుముందు తొలి టెస్టును నెగ్గిన పాక్ తాజా విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది.