: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లే ఫేవరేట్లు!
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ విద్యా సంస్థల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఈ-కామర్స్ సంస్థలే ఫేవరేట్లుగా నిలుస్తున్నాయి. వాటిలోనూ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లే ముందంజలో ఉన్నాయి. అసోచామ్ నిర్వహించిన సర్వేలో 500 మంది విద్యార్థులను కదిలిస్తే, వారిలో 71 శాతం మంది తాము ఈ-కామర్స్ సంస్థల ఉద్యోగాలకే ఓటేస్తామని చెప్పారట. రూ.10-25 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేస్తున్న ఈ-కామర్స్ సంస్థలను కాదని వేరే కంపెనీల వైపు ఎందుకు దృష్టి సారిస్తామని కూడా వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక శరవేగంగా వృద్ధి సాధిస్తున్న ఈ-కామర్స్ సంస్థలు ఏటా వేతనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఏటేటా పెంచిన ప్యాకేజీలతోనే ఆ కంపెనీలు వస్తున్నాయి.