: జిహాదీలు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు: అసోం సీఎం
బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు తనను లక్ష్యంగా చేసుకున్నారని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చెప్పారు. తనతో పాటు రాష్ట్ర సచివాలయం, కామాఖ్య ఆలయం కూడా వారి జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆలయానికి, హాని ఉన్న ఇతర ప్రదేశాలకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ రక్షణ ఉన్న తనకు రాష్ట్ర పోలీసు భద్రత సిబ్బంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు కూడా రక్షణగా ఉండనున్నారని వివరించారు. అటు జిహాదీలకు సంబంధించిన కేసులన్నింటినీ ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు.