: కోల్ కతా వీధుల్లో అమితాబ్ సైకిల్ సవారీ
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోల్ కతా వీధుల్లో సైకిల్ పై సవారీ చేశారు. తన చలనచిత్ర ప్రయాణాన్ని ప్రారంభించిన నగరంలోని చరిత్రాత్మక రైటర్స్ బిల్డింగ్ వద్ద ఇలా ఆయన కెమెరాకు చిక్కారు. ముఖం, గడ్డం కనిపించకుండా పెద్ద టోపీ ధరించి, బాన పొట్టతో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. దర్శకుడు షూజిత్ సిర్కార్ రూపొందిస్తున్న 'పికు' చిత్రంలో ప్రస్తుతం అమితాబ్ నటిస్తున్నారు. దానికి సంబంధించిన చిత్రీకరణలో భాగంగానే ఇలా ఆయన సైకిల్ తొక్కారు.