: బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లతో ఈ సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సాయంత్రం బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సమావేశం నిర్వహించనున్నారు. రాజధానిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి చర్చించనున్నారు. అసెంబ్లీలో అధిక సంఖ్యాబలం ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలిచే అవకాశం ఉంది. అటు తమను అధికారికంగా ఆహ్వానిస్తే ప్రభుత్వం నెలకొల్పాలని బీజేపీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్, ఏఏపీ మాత్రం కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి.