: చంపేస్తామంటూ బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ కు ఫోన్ కాల్
బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ను చంపేస్తామంటూ ఆగంతుకుడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వెంటనే ఆయన ఫిర్యాదు చేయడంతో పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి, బీజేపీ నుంచి తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ ఫోన్ చేసిన వ్యక్తి చెబుతున్నట్టు ఆయన తెలిపారు. ఆ ఫోన్ కాల్ దుబాయ్ నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారు.