: సుప్రీంకోర్టుకు చేరిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నివేదిక
ఐపీఎల్-6లో సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించిన నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై ఏర్పాటైన ముద్గల్ కమిటీ కాసేపటి క్రితం తన నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. మూడు నెలల విచారణ అనంతరం కమిటీ తన నివేదికను సమర్పించింది. నవంబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది.