: నల్లధనంపై పోరులో స్వదేశీ బ్యాంకులపై మోదీ సర్కారు నిఘా!
నల్లధనంపై రాజీలేని పోరును ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల మెడలు వంచారు. నల్లధనం ఖాతాల వివరాలను వాటి యజమానుల పేర్లు సహా రాబట్టారు. తాజాగా స్వదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశీయ బ్యాంకులకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న పలు కార్పొరేట్ సంస్థలతో పాటు రాజకీయ నేతలు బినామీ పేర్లతో కొనసాగిస్తున్న ఖాతాలపై నిఘా వేసి ఉంచాలని బ్యాంకులను కోరేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సన్నాహాలు చేస్తోంది. మరోవైపు 'మీకు తెలిసిన నల్ల కుబేరుల వివరాలను ఆధారాలతో మాకందించండి, వారి పని పడతా'మని నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.