: డెంగ్యూకు వ్యాక్సిన్ వస్తోంది!


ప్రమాదకర డెంగ్యూ వ్యాధికి చెక్ పెట్టనున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది చివరి నాటికి మనకు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సనోఫీ పాశ్చర్ రూపొందించిన సీవైడీ-టీడీవీ వ్యాక్సిన్ భారత్ లో వ్యాధి నివారణకు సంబంధించి మెరుగైన ఫలితాలు సాధించింది. ఢిల్లీ, లూధియానా, బెంగళూరు, పూణె, కోల్ కతాల్లో 18-45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై జరిగిన ప్రయోగాల్లో ఈ మేర సత్ఫలితాలు నమోదయ్యాయని ఆ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం అధిపతి నికోలస్ జాక్సన్ చెప్పారు. మరోవైపు ఈ తరహా ప్రయోగాలు జరిగిన ఆసియా దేశాల్లో భారత్ లోనే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రయోగాల్లో భాగంగా 87 శాతం మందిలో ఈ వ్యాక్సిన్ డెంగ్యూను నివారించిందని తేలింది.

  • Loading...

More Telugu News