: ఇక సర్కారీ ఉద్యోగులకు ’యోగా‘ యోగం!


ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న ప్రైవేట్ కంపెనీలను చూశాం. అయితే ఈ తరహా వెసులుబాటు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అందుబాటులోకి రాలేదు. కాని నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్కారీ ఉద్యోగులకు కార్పొరేట్ తరహా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు సమయపాలన కోసం బయో మెట్రిక్ హాజరు అమలుకు తీర్మానించిన సర్కారు, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు యోగాను అందుబాటులోకి తెస్తోంది. ఆయుర్వేద, ఇతర వైద్య విభాగాల సమాహారం 'ఆయుష్' ఈ దిశగా చర్యలు చేపడుతోంది. తొలుత పోలీసు శాఖలో రంగప్రవేశం చేయనున్న ఆయుష్ యోగా తరగతులు పని ప్రదేశాల్లోనే ఉద్యోగులతో క్రమం తప్పకుండా యోగా చేయిస్తాయి. పోలీసు శాఖలో నమోదయ్యే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అమలు చేసేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఏళ్లుగా యోగా చేస్తున్న ప్రధాని మోదీ, తన ఆరోగ్యాన్ని మెరుగైన రీతిలో కాపాడుకుంటున్నారు. ఇటీవలి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంలోనూ మోదీ యోగా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News