: ఈ దఫా టీడీపీ సభ్యత్వ నమోదులో అన్నీ రికార్డులే!


తెలుగుదేశం పార్టీ నేడు ప్రారంభించనున్న సభ్యత్వ నమోదు రికార్డుల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. తొలిసారిగా పేపర్ లెస్ సభ్యత్వ నమోదుకు పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఐపాడ్ లతో మండలాలు, గ్రామాలకు వెళ్లే పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదును చేపడతారు. కార్యకర్త ఫొటోతో సదరు వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డులను కూడా నమోదు చేసుకుంటారు. ఈ తరహాలో సభ్యత్వ నమోదు చేపట్టిన తొలి పార్టీగా టీడీపీ చరిత్ర సృష్టించనుంది. ఇక రూ.100 చెల్లించి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకునే వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా లభించనుంది. దేశంలోనే పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించిన పార్టీగా టీడీపీ చరిత్ర పుటలకెక్కింది. ఇదిలా ఉంటే, ప్రాంతీయ పార్టీ హోదాను దాటి, జాతీయ స్థాయి హోదాకు చేరువైన టీడీపీ, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదును చేపట్టనుంది. ఏపీ తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ సభ్యత్వ నమోదును చేపట్టనుంది. ఈ దఫా సభ్యత్వ నమోదుతో 25 లక్షల మంది క్రియాశీల సభ్యులతో అమెరికా సైన్యం రికార్డును బద్దలు కొట్టేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ అవలంబిస్తున్న తాజా విధానాలతో 25 లక్షల మంది కంటే అధికంగానే సభ్యత్వం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News