: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత


బాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూశారు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్న ఆయన నిన్న (ఆదివారం) రాత్రి 2.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. 64 ఏళ్ల వయసున్న సదాశివ్ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో గత కొంత కాలంగా బాధపడుతూ ఉన్నారు. స్వగ్రామం అహ్మద్ నగర్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సదాశివ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బైదాన్ ఆడిటోరియంలో ఉంచబోతున్నారు. 'సడక్' చిత్రంలో విలన్ గా సదాశివ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంఖే, కూలీ నెంబర్ 1, గుప్త్, అర్థ్ లాంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. అర్థ్, సడక్ చిత్తాలకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు పొందారు. 2012లో 'బాంబే టాకీస్' చిత్రంలో చివరి సారిగా నటించిన సదాశివ్... సినిమాలు తగ్గించుకుని, సామాజిక సేవకు ప్రధాన్యత ఇచ్చారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News