: ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించమంటూ ఢిల్లీ వెళ్లిన హరీష్


టీఎస్ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి శ్రీశైలం నీరు, విద్యుత్ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఆయన హస్తిన బాట పట్టారు. ఈ క్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఆయన కలవనున్నారు. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ సర్కారు పలు నియమాలను ఉల్లంఘిస్తోందని పిర్యాదు చేయనున్నారు. శ్రీశైలం బోర్డు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకునేలా చేయాలని కోరతారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ... నాగార్జున సాగర్ లో ఉత్పత్తిని నిలిపివేయాలనేది తెలంగాణ వాదనగా ఉంది.

  • Loading...

More Telugu News