: నేడు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ సంతకం


తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరతను నివారించేందుకు రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు కీలక ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్ గఢ్ కు వెళ్లిన కేసీఆర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో ఆదివారమే చర్చలు జరిపారు. తెలంగాణ ప్రతిపాదనకు రమణ్ సింగ్ సర్కారు కూడా సరేననడంతో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం నేడు కుదరనుంది. ఒప్పందంలో భాగంగా వెయ్యి మెగావాట్లను ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం తెలంగాణకు విక్రయిస్తుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు అధికారికంగా సంతకాలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News