: విశాఖ ఉక్కు కర్మాగారం పునఃప్రారంభం
విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారం పునఃప్రారంభమైంది. హుదూద్ తుపాను ధాటికి అతలాకుతలమైన విశాఖ ఉక్కు కర్మాగారంలోని పలు విభాగాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో నవరత్న హోదా ఉన్న విశాఖ ఉక్కు గత కొన్ని రోజులుగా మూతపడింది. కర్మాగారం తిరిగి పని చేసేందుకు శ్రమించి మరమ్మతులు చేసిన విశాఖ ఉక్కు సిబ్బందిని సీఎండీ మధుసూదన్ అభినందించారు.