: ఓపెనర్ల వీరవిహారం... టీమిండియా 231/1


టీమిండియా ఓపెనర్లు వీరవిహారం చేశారు. గత కొంత కాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా ఓపెనర్ల ద్వయం జూలు విదిల్చింది. ఓపెనర్లిద్దరూ ఒకేసారి ఫాం అందిపుచ్చుకుని శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్ల వీరవిహారానికి శ్రీలంక బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆరంభం నుంచి సాధికారకమైన ఆటతీరుతో ధావన్ (113), రహానే (111) సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా 34 ఓవర్లలో 231 పరుగులు చేసింది. ప్రియాంజన్ బౌలింగ్ లో ధావన్ అవుట్ కావడంతో రహానేకు రైనా జత కలిశాడు.

  • Loading...

More Telugu News