: కేంద్రానికి వెయ్యికోట్ల ప్రతిపాదనలు పంపాం: హరీష్ రావు
చెరువుల పునరుద్ధరణకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల ప్రణాళికలు కేంద్రానికి పంపామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ- ప్రోక్యూర్ మెంట్ టెండర్ల ద్వారా, అవినీతికి తావు లేకుండా చెరువులను పునరుద్ధరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని స్థాయుల అధికారులను భాగస్వాములను చేస్తామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ నుంచి మే నెల వరకు చెరువులను పునరుద్ధరించి, మండల కేంద్రాల్లో ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.