: మా ప్రభుత్వంలో శివసేన చేరుతుంది: మహా సీఎం ఫడ్నీవీస్


తమ ప్రభుత్వంలో శివసేన చేరుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ చెప్పారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఈ చర్చలు ఓ కొలిక్కి రానున్నాయని ఆయన ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శివసేన సభ్యులు తమ ప్రభుత్వంలో చేరే ప్రకటన సరైన సమయంలోనే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్సీపీతో పొత్తు, అజిత్ పవార్ అవినీతి వ్యవహారంపై స్పందించిన ఫడ్నవీస్, అవినీతికి పాల్పడ్డ వారు తమ సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఎన్సీపీలో పొత్తుకు మోదీ సుముఖంగా లేరన్నారు.

  • Loading...

More Telugu News