: నేడు పుట్రంరాజు వారి కండ్రిగకు సచిన్


మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్రం ఇటీవల ప్రారంభించిన సంసద్ గ్రామీణ యోజనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని పుట్రంరాజు వారి కండ్రిగను సచిన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదిలోగా ఈ గ్రామాన్ని సచిన్, తన ఎంపీల్యాడ్స్ తో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఇప్పటికే గ్రామానికి రూ.2 కోట్లకు పైగా నిధులను ప్రకటించిన సచిన్, నేడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. సచిన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ సహా, అధికార యంత్రాంగం మొత్తం కండ్రిగలో తిష్ట వేసింది. సచిన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచిన్ నిధులకు తోడు జిల్లా అధికార యంత్రాంగం కూడా గ్రామానికి దాదాపుగా రూ.3 కోట్లను కేటాయించింది.

  • Loading...

More Telugu News