: పవన్ కల్యాణ్ గారూ...చీపురు పట్టండి: పీవీ సింధూ


స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాలుపంచుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ ఆహ్వానించింది. శనివారం హైదరాబాద్ లో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న సందర్భంగా సింధూ ఈ మేరకు ప్రకటన చేసింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది మంది పేర్లను ప్రస్తావించారు. ఆ జాబితాలోని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్వచ్ఛ భారత్ లో పాల్గొని తానూ తొమ్మిది మందిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పేర్లలో పీవీ సింధూ కూడా ఒకరు. సానియా ఆహ్వానాన్ని మన్నించిన సింధూ శనివారం స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది ప్రముఖుల పేర్లను ప్రస్తావించేందుకు బదులుగా, ముగ్గురు పేర్లను మాత్రమే ప్రకటించారు. అందులో పవన్ కల్యాణ్ ఒకరు. మరి, పవర్ స్టార్ ఎప్పుడు చీపురు పడతారో!

  • Loading...

More Telugu News