: నేడు టీమిండియా, శ్రీలంక మధ్య తొలి వన్డే


ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, శ్రీలంకల మధ్య తొలి వన్డే నేడు కటక్ లో జరగనుంది. కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్ల యువ సత్తా మధ్య ప్రధానంగా పోరు సాగనుంది. ఇటు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తుండగా, అటు లంక కూడా పెద్ద సంఖ్యలో యువతతో బరిలోకి దిగుతోంది. వెస్టిండిస్ తో సిరీస్ అర్థాంతరంగా ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ, శ్రీలంకతో సిరీస్ కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో కోహ్లీ సారధ్య బాధ్యతలను స్వీకరించాడు. మొన్నటిదాకా పేలవ ఫాంతో నిరాశపరిచిన కోహ్లీ, వెస్టిండిస్ సిరీస్ లో పుంజుకున్నాడు. అదే ఫాంను కొనసాగించడం ద్వారా తన సత్తా చాటేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ఈ సిరీస్ ను గెలుచుకోవడం ద్వారా ప్రపంచ కప్ కు రెట్టించిన ఉత్సాహంతో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News