: 'స్వచ్ఛ భారత్' టీడీపీదే... పేరు మారిందంతే!: అశోక్ గజపతిరాజు
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గతంలో పచ్చదనం-పరిశుభ్రత పేరిట టీడీపీ నిర్వహించిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరంలోని గంట్యాడ మండలం రామవరంలో జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమమే దేశమంతా 'స్వచ్ఛ బారత్'గా అమలవుతోందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు చీపురు పట్టి రోడ్లను ఊడ్చి, పాఠశాల వద్ద మొక్కలు నాటారు. పేదరిక నిర్మూలనకు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బాలికా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.