: 6758 'ఆడీ' కార్లు వెనక్కి


భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను వెనక్కి పిలవాలని లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 మధ్య ఉత్పత్తి చేసిన ఏ4 సెడాన్ కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే వాటిని వెనక్కి పిలుస్తున్నామని, వాటిలో ఎలాంటి కొత్త పరికరాలను అమర్చబోమని ఆడీ కంపెనీ స్పష్టం చేసింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులను డీలర్లు సంప్రదించి సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆ కంపెనీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News