: కోస్తాకు మరో తుపాను ముప్పు
హుదూద్ తుపాను చేసిన గాయం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 8 లేదా 9వ తేదీని తుపాను వచ్చే కోస్తాను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 5న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది 8, 9 తేదీల్లో తుపానుగా మారవచ్చని ఐఎండీ అధికారులు వెల్లడించారు.