: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా నాగార్జున యూనివర్శిటీ
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా నాగార్జున యూనివర్శిటీని ఎంపిక చేశారు. ప్రభుత్వ పాలనాయంత్రాంగం కొత్త రాజధాని కోసం భూ సేకరణ జరిపే గ్రామాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల కమిటీ గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ భవనాలను పరిశీలించింది. యూనివర్సిటీలోని కొన్ని విభాగాలను ఇతర విభాగాల భవనాల్లోకి మార్చి, సచివాలయ కార్యాలయాలుగా తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.