: 'హెచ్ పీ' వాచ్ ల ద్వారా ఇక మెయిల్స్ కూడా పంపుకోవచ్చు!


ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్ పీ డిజైనర్ స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాచ్ డిజైన్ కోసం ప్రత్యేక మార్పులు చేయకుండా, సంప్రదాయ వాచ్ లలానే హెచ్ పీ రూపొందించింది. దీనికి అదనపు హంగులను సమకూర్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రెండు రంగుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని తయారు చేశారు. వాచ్ ల ధర 349 డాలర్ల నుంచి 649 డాలర్ల వరకు నిర్ణయించారు. ఈ వాచ్ ల ద్వారా టెక్స్ ట్ మెసేజ్ లు, ఈ మెయిల్స్ పంపుకోవచ్చని హెచ్ పీ తెలిపింది. దీనికి ఉన్న ఎల్సీడీ తెరపై వాతావరణం, స్టాక్ ఎక్సేంజ్ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News