: 30 వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోషిస్తారా?
లోక్ సత్తా పార్టీ 8వ వార్షికోత్సవ సభ గుంటూరులో జరిగింది. ఈ సందర్బంగా ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి 2 నుంచి 3 వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 30 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్ని వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోషిస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలతో రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూమిని అభివృద్ధి చేసి, అందులో సగం వారికే తిరిగివ్వాలని జేపీ సూచించారు.