: పుట్టినరోజు సందర్భంగా ఐష్ కు 'జజ్బా' టీజర్ గిఫ్ట్
అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఈరోజు 41వ పడిలోకి అడుగుపెట్టింది. ఈసారి పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఐష్, కేవలం కుటుంబసభ్యులతోనే గడపనుంది. మరోవైపు, అమ్మడి జన్మదిన్నాన్ని పురస్కరించుకుని తను నటించనున్న 'జజ్బా' చిత్రం మూడు నిమిషాల టీజర్ ను దర్శకుడు సంజయ్ గుప్తా ఐష్ కు బహుమతిగా ఇచ్చాడు. "ఈ టీజర్ గిఫ్ట్ ఆలోచన చాలా ఆలస్యంగా తట్టింది. ఆమెకు ఎందుకు ఓ టీజర్ రూపొందించి ఇవ్వకూడదనుకున్నా. ఐశ్వర్యకు దాని గురించి అసలు తెలియకూడదనుకున్నాం. సరైన సమయంలో ఇవ్వాలని రోజుకు 18 గంటలు కష్టపడి మరీ తయారుచేశాం" అని గుప్తా తెలిపాడు. మరోవైపు, భర్త అభిషేక్ బచ్చన్ ఐష్ కోసం ఇటీవలే దుబాయ్ లో షాపింగ్ చేశాడట. అటు కుమార్తె ఆరాధ్య తల్లికోసం ప్రత్యేకంగా ఓ కార్డును డిజైన్ చేసి ఇచ్చిందట.