: పోలీసుల ఎదుట లొంగిపోయిన భూమా నాగిరెడ్డి
నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అజ్ఞాతం వీడారు. నంద్యాల ఏఎస్పీ సల్ ప్రీత్ సింగ్ సమక్షంలో లొంగిపోయారు. భూమాపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి ఎక్కడున్నా అజ్ఞాతం వీడాలని... వెంటనే లొంగిపోవాలని జిల్లా ఎస్పీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, భూమా కోసం పోలీసులు గాలింపు కూడా చేపట్టారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడిన ఘటనలో భూమాతో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.