: 'కన్నడ రాజ్యోత్సవ' సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
'కన్నడ రాజ్యోత్సవ' సందర్భాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో "కన్నడ రాజ్యోత్సవ' పురస్కరించుకుని కర్ణాటక ప్రజలకు నా శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కర్ణాటక రాష్ట్రం కొత్త తరహాలో పురోగతిని సాధించాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. 1956, నవంబర్ 1న కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఆ రాష్ట్రం 'కన్నడ రాజ్యోత్సవ' పేరుతో సెలబ్రేట్ చేసుకుంటోంది.