: ప్రమాణ స్వీకారం రోజే ఫడ్నవీస్ పై పూణె కోర్టులో ఫిర్యాదు
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆదే రోజున ఆయనపై పూణె కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫడ్నవీస్ నాగ్ పూర్ లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని దేశ్ బచావో పార్టీ అధ్యక్షుడు హేమంత్ పాటిల్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న ఫడ్నవీస్ ఫోటోను కూడా పాటిల్ తన ఫిర్యాదుకు జతపరిచారు. కాగా, నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపైనా ఇలాంటి ఫిర్యాదే దాఖలైంది.