: చెల్లి పెళ్లికి మోదీని ఆహ్వానించనున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వచ్చేవారం సల్మాన్ ఢిల్లీ వెళ్ళనున్నాడు. అర్పిత వివాహం ఈ నెల 18న జరగనుంది. ఈ విషయమై సల్మాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ మాట్లాడుతూ, అర్పిత పెళ్లికి మోదీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అర్పిత గత ఏడాదిన్నరగా ఢిల్లీకి చెందిన ఆయుష్ తో డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు అతడినే పరిణయమాడనుంది. వీరి వివాహానికి హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా నిలుస్తోంది.