: బీరు లోడు బోల్తా... పండుగ చేసుకున్న గ్రామస్తులు


ఉత్తరప్రదేశ్ లోని బరేలీ వద్ద బైపాస్ రోడ్డుపై బీరు కేసులను తీసుకెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో సమీప గ్రామస్తులంతా సంఘటన స్థలానికి తరలివెళ్ళారు. ఎవరికి దొరికిన కేసులను వారు ఇంటికి మోసుకెళ్ళారు. బిందెలు, బక్కెట్లు, చెంబులు, చివరికి ప్లాస్టిక్ సంచులు కూడా తీసుకెళ్ళారట... పగిలిన సీసాల్లోని బీరు కోసం. చివరికి ఎవరో సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు లారీ డ్రైవర్ ను, అతని సోదరుడిని బయటికి తీశారు. వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇక, గ్రామస్తుల విషయానికొస్తే... కొందరు బోల్తా కొట్టిన లారీ వద్దే బీర్లు తాగడం మొదలుపెట్టగా, దారిన పోయే ప్రయాణికులు సైతం వారికి జత కలిశారట.

  • Loading...

More Telugu News