: నేను ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేనో చెప్పండి!: భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్


తాను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తాను ఏ రాష్ట్రానికి చెందుతానో కూడా తనకు తెలియడం లేదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని... దీని వల్ల తనలో తీవ్ర అయోమయం నెలకొందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన మండలాల్లోనే తన సొంత గ్రామం కూడా ఉందన్నారు. భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని 116 గ్రామాల్లో 63 గ్రామాలను ఏపీలో కలిపారని... దాంతో, ఆ గ్రామాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు, సంక్షేమ పథకాలను నిలిపివేసిందని ఆయన అన్నారు. ఈ విషయంలో, తనకు స్పష్టత ఇవ్వాలని కొన్ని రోజులుగా అపాయింట్ మెంట్ అడుగుతున్నా గవర్నర్ నరసింహన్ ఇవ్వడం లేదన్నారు.

  • Loading...

More Telugu News