: శ్రీశైలం మల్లన్న సేవలో పరిటాల సునీత


ఎపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా మహామంగళహారతి సేవలో పాల్గొన్న ఆమె... స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో నిత్యావసరాల ప్యాకేజీని అందజేస్తామని తెలిపారు. ఈ ప్యాకేజీ కింద ఏయే వస్తువులను పంపిణీ చేయాలన్న విషయంపై ప్రజల నుంచే అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. చౌక దుకాణాల్లో సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువుల నాణ్యతను పెంచుతామని అన్నారు.

  • Loading...

More Telugu News